మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 01 :
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాజేశ్వర్ రావు పేట బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మహిళ మృతి చెందింది. ఎర్రపుర్ నుండి మెట్ పల్లి వైపు వస్తున్న టిప్పర్ ను కమ్మరపల్లి నుండి వస్తున్న ద్విచక్ర వాహనం టిప్పర్ ను డీ కొట్టడంతో టిప్పర్ టైర్ కింద పడి మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె బావ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ అనిల్ తెలిపారు