కామారెడ్డి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 30
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిన్న ఆరెపల్లి గ్రామానికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయొద్దని అనిల్ భార్య చెప్పడంతో ఆవేశంలో ఇంటి నుండి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.