నిర్మల్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 28 :
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో గల దేవిబాయి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేసే లక్ష్మణ్(25) ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతీతో గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ యువతి కొన్ని రోజులుగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డా ఉదయం వరకు తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అని బంధువులు మండిపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.