- 5 గురి అరెస్ట్
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 23 :
జగిత్యాల జిల్లా రాయికల్, మల్లాపూర్ మండలాల్లో వేరు వేరు ఘటనలలో 10 కిలోల గంజాయితో పాటు ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహింస్తుండగా 25 సంవత్సరాల యువకులు గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.నిందితులు గణేష్, సతీష్, సాగర్, అజయ్, నితిన్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద 10 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వైజాగ్ నుండి గంజాయి స్మగ్లర్లతో స్నేహం చేసి జగిత్యాల జిల్లాలో గంజాయి సరఫరా చేయడానికి వీరు ఒప్పందం కుదుర్చుకొని, గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇలాంటి స్మగ్లింగ్లకు పాల్పడవద్దని సూచించారు.