నాగర్ కర్నూల్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 23 :
నాగర్ కర్నూల్ – అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మేడమోని కల్పన(29) అనే గర్భిణీ ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా.. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ తన ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రికి వచ్చిందని అక్కసుతో ప్రసవం చేయకుండా నిరాకరించాడు. భార్య ఆవేదన చూసి భర్త ఆంజనేయులు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, సర్జరీ అనంతరం మగబిడ్డకు జన్మనిచ్చిన కల్పన తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది.