మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 21 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ ఫ్లాగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపో నుండి మనోహర్ గార్డెన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ బీమా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ ను ఉద్దేశించి మెట్ పల్లి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, ప్రజలందరూ కూడా ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏస్పీ బీమ్ రావు, మెట్ పల్లి డిఎస్పీ ఉమా మహేశ్వర రావు, సిఐ ప్రవీణ్, కోరుట్ల సిఐ సురేష్ బాబు, సిఐఏఎస్ఎఫ్ సచిన్ వర్మ, ఎస్ ఐలు, 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.