మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 20 :
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గండి హనుమాన్ అంతర్ జిల్లా సరిహద్దు పోలీస్ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కరీంనగర్ కు చెందిన కోట శ్రీనివాస్ అనే వ్యక్తి నిజామాబాద్ నుండి కరీంనగర్ కు TS08FG8452 గల కారులో వెళ్తుండగా అతడి కారును తనిఖీ చేయడంతో 53 వేల నగదు పట్టుబడ్డాయి. నిర్మల్ జిల్లాకు చెందిన తీగల భరత్ గౌడ్ అనే వ్యక్తి నిర్మల్ నుండి జమ్మికుంట కు వెళ్తూ ఉండంగా బండ లింగాపూర్ గ్రామంలోని గండి హనుమాన్ అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండంగా AP36AN3232 నెంబర్ గల హ్యుందాయ్ i10 కార్ లో 2 లక్షలు పట్టుబడ్డాయి. మొత్తం 2 లక్షల 53 వేల రూపాయలకు ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో రెండు కార్లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ అనిల్ తెలిపారు.