హైదరాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 20
హైదరాబాద్ – ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) అనే యువతికి మేన బావతో పెళ్లి కుదరింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడుతుంది, అదే సమయంలో తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి, చీరతో ఉరేసి చంపినట్లు పోలీసులు తెలిపారు.