Rr News Telangana
క్రైమ్ముంబై

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌ నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి

ముంబై, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 19

మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు మావోయిస్టు అగ్రనేత లు మృతి చెందినట్టు తెలిసింది.. వారిని డీవీసీ సభ్యు లు వర్గీష్‌, మంగాతు, ప్లా టూన్‌ సభ్యులు కురుసం రాజు, వెంకటేశ్‌గా గుర్తించారు.ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతు ల్లో ఇద్దరిపై పోలీసులు శాఖ గతంలో భారీ రివార్డు ప్రకటించింది.వారిపై రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.

Related posts

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Rr News Telangana

ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో వ్యక్తి మృతి

Rr News Telangana

అమెరికాలోని స్టోర్‌లో దొంగతనం చేసిన ఇద్దరు తెలుగు విద్యార్థినిలు అరెస్ట్

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group