- ఒక కారును, తుపాకిని, బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 19 :
నెమలిని చంపి కారులో తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగాధర మండలంలోని లక్ష్మీ దేవిపల్లి గ్రామానికి చెందిన నలువాల సత్యనారాయణ, మాల్యాల గ్రామానికి చెందిన జువ్వాజి రాజు అనే ఇద్దరు వ్యక్తులు సోమవారం సాయంత్రం దోమలకుంట గ్రామ శివారులో లైసెన్స్ లేకుండా తుపాకితో సంచరించి తుపాకితో నెమలి కాల్చి చంపి దానిని తమ కారులో తీసుకొని వెళ్తున్నారని సమాచారం మేరకు జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ ఆదేశాల మేరకు మల్యాల సి.ఐ పెగడపల్లి పోలీసు సిబ్బందితో కలిసి నెమలిని వేటాడి చంపిన నారాయణ, రాజులను పట్టుకొని నెమలిని చంపిన తుపాకితో పాటు కారును, బుల్లెట్ లను, గొడ్డలిని స్వాదీనం చేసుకొని నారాయణ, రాజులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. నెమలిని చంపిన నిందితులను పట్టుకున్న పెగడపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.