ఇబ్రహీంపట్నం, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 19 :
మాజీ భర్తపై యాసిడ్ పోసిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఎర్దండి గ్రామానికి చెందిన నీరటి మహేష్ మెట్ పల్లి మండలంలోని జగ్గసాగర్ గ్రామానికి చెందిన మాస లక్షణ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది. భార్య భర్తలకు మనస్పర్థలు రావడంతో 2023లో మహేష్ లక్షణ వ కోర్టు నుండి విడాకులు తీసుకున్నారు. మహేష్ మరో యువతిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని బుధవారం మహేష్ మరో యువతిని వివాహం చేసుకుంటున్నడని తెలిసుకున్న మాజీ భార్య లక్షణ మహేష్ పై కక్ష పెట్టుకొని మంగళవారం మహేష్ ఇంటికి వెళ్లిన లక్షణ మహేష్ ఇంటి నుండి బయటకు రాగానే మహేష్ పై లక్షణ యాసిడ్ పోయడంతో మహేష్ కు గాయాలయ్యాయి. మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ అనిల్ తెలిపారు.