మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 19 :
మెట్ పల్లి కాంక్రీట్ లిఫ్ట్ మిల్లర్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. లేబర్ పనికి వెళ్లిన పిట్ల సాయమ్మ, ద్వారగుల రాజమణిలు పని చేస్తున్న క్రమంలో వారికి తేలికపాటి గాయాలు కావడంతో సాయమ్మకు 3వేలు, రాజమణికి 3వేలు మెట్ పల్లి కాంక్రీట్ లిఫ్ట్ మిల్లర్ ఓనర్స్ యూనియన్ వారు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సురిగాల శంకర్, ఉపాధ్యక్షుడు షేక్ కమల్ పాషా, క్యాషియర్ చిత్తారి స్వామి తో పాటు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.