- జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 16 :
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న జగిత్యాలలో బహిరంగ సభ సందర్భంగా పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా కేంద్రంలోనికి ఆదివారం సాయంత్రం నుoడి సోమవారం సాయంత్రం వరకు భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. ఆదివారం, సోమవారం ఎటువంటి డ్రోన్లు పట్టణంలో ఎగురవేయడానికి అనుమతి లేదుని, అదే రోజు SSC పరీక్షలు ఉండటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వీలైనంత త్వరగా చేరుకొవాలని సూచించారు.
ట్రాఫిక్ డైవర్షన్ :
కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు ధరూర్ పెద్ద కెనాల్ బైపాస్ ద్వారా కోరుట్ల వైపు వెళ్ళవలసి ఉంటుందని అన్నారు. నిజామాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు తాటిపల్లి బైపాస్ ద్వారా ధరూర్ పెద్ద కెనాల్ మీదుగా వెళ్ళవలసి ఉంటుందని, ధర్మపురి నుండి కరీంనగర్ వైపు వెళ్లేవారు తమ వాహనాలను పొలాస నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా, ధరూర్ పెద్ద కెనాల్ వైపు వెళ్ళవలసి ఉంటుందని,కరీంనగర్ నుండి ధర్మపురి వైపు వెళ్లేవారు తమ వాహనాలను ధరూర్ పెద్ద కెనాల్ వైపు నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా పొలాస వైపు వెళ్ళవలసి ఉంటుందని, ధర్మపురి నుండి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు పొలాస నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా, ధరూర్ పెద్ద కెనాల్ బైపాస్ ద్వారా కోరుట్ల వైపు వెళ్ళవలసి ఉంటుందని సూచించారు.