ఇబ్రహీంపట్నం, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 12 :
అప్పుల బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం….మండలంలోని ఎర్రాపూర్ గ్రామానికి చెందిన మాలవత్ అమిలాల్ (45) అనే వ్యక్తి శనివారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన అతడి భార్య ప్రమీల చుట్టుపక్కల వారి సహాయంతో అమిలాల్ ను కిందకు దింపి మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ అనిల్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు ఉన్నారు.