మెట్ పల్లి,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి12 :
మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావ్ పేట్ క్రిస్టియన్స్ కాలనీలో నివాసం ఉంటున్న తిమ్మని విజయ నిర్మల ఇంట్లో బారి చోరీ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. తిమ్మని విజయనిర్మల ఆమె సోదరుని శుభాకార్యానికి సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లగా మంగళవారం తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు.ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం,30తులాల వెండి,ఒక లాప్ టాప్,30 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు వాపోయింది . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.