బైంసా, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 10 :
నిర్మల్ జిల్లా భైంసా ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ కత్తిపోట్లతో ఒక్కరు మృతి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ సమీపంలో శనివారం 7 గంటల సమయంలో కత్తిపోట్ల కలకలం రేగింది. ఇందులో ఒకరు మృతి చెందారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఒకే వర్గానికి చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య మాట మాట పెరిగి కత్తితో దాడి చేయగా సోహెల్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సోహెల్ ను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.