- జనవాసల మధ్య కిరణషాపులో ఆక్రమ మద్యం అమ్మకాలు
- ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లో కిరణషాపులో అక్రమ మద్యం అమ్మకాలు
- ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 08 :
మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని కోరుట్ల మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మండాలలతో పాటు మెట్ పల్లి , కోరుట్ల మున్సిపల్ కేంద్రంలో జనవాసల మధ్య ఉన్నటువంటి కిరణ షాపులో అక్రమ మద్యం పట్టపగలే అమ్ముతున్నారు. దీంతో కాలనీలలో మధ్యం ప్రియులు రోడ్లపై తాగుతున్నారు, దీనితో కాలనిలో నివసిస్తున్న మహిళలు రోడ్డుపై నడిచి వెళ్లిందుకు జక్కుతున్నారు. మద్యం ప్రియులు వెకిలిచేస్తాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
దీనికి తాజా ఉదాహరణ :
మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో ఓ కిరణ షాపులో అక్రమ మధ్యం అమ్ముతున్నారు. పేరుకు మాత్రం కిరణషాపు అందులో విచ్చిలవిడిగా మధ్యం అమ్ముతూ, ఆ కిరణషాపు లోనే మధ్యం సేవిస్తున్నారు. చరవాణి ద్వారా వివరణ కోసం ఎక్సైజ్ సిఐకి ఫోన్ చేయగా సిఐ స్పందించక పోవడం కొసమెరుపు.ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి కిరణషాపులలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు