- రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
- గడిచిన నెల రోజులో మద్యం సేవించి వాహనలు నడిపిన 956 మంది పై కేసులు నమోదు
- జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 05 :
గడిచిన నెల రోజులో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 956 మంది వ్యక్తులకు పట్టుకోవడం జరిగిందని ఇందులో 233 మంది వ్యక్తులకు కోర్టు ద్వారా 198400/- రూపాయల జరిమానలు విధించడం జరిగిందిని ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే సెక్షన్ 304-II కేసు లు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగు తుందని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబం ధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగు తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించ డంతో పాటు , ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లదండ్రులకు బాధ్యత వహంచాలనీ హెచ్చరించారు.వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.