మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 04 :
మెట్ పల్లి పట్టణానికి చెందిన కనికరపు సరిత అనే గృహిణి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. సరిత గురుకుల సోషల్ స్టడీస్ పిజిటి, టిజిటి ఉద్యోగాలకు సరిత ఎంపి కయ్యింది. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కస్టమయ్యే ఈ రోజుల్లో ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో సరిత కుటుంబ సభ్యులు మరియు బంధువులు కాలనీ వాసులు సరితను అభినందించారు.