కోరుట్ల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 04 :
మెట్ పల్లి డబల్ బెడ్ రూమ్ అర్బన్ హౌసింగ్ కాలనీ లో గ్రహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ఉద్దేశం మంచిదేనని దానిని ఉపయోగించుకోవాలని సూచించారు.అనంతరం స్థానిక కౌన్సిలర్ ఫర్జానా బేగం షాకీర్ మాట్లాడుతూ,
ఆరు గ్యారంటీలలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలిపారు.కోరుట్ల నియోజకవర్గంలో మొత్తం 93065 గృహ సర్వీసులకు గాను 47997 మంది అంటే సుమారు 52 శాతం గృహజ్యోతి పథకం కింద పొందను న్నారని మెట్పల్లి డీఈ తిరుపతి తెలిపారు. ఇంకా నమోదు చేసుకొనని వారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, మెట్టుపల్లి ఏడీఈ మనోహర్, ఏఏవో శంకర్, ఏఈ లు రవి, అమరేందర్, నవీన్, విద్యుత్ సిబ్బంది, స్పాట్ బిల్లర్లు మరియు సుమారు 150 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.