బైంసా, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 02 :
భైంసా పట్టణంలోని కిసాన్ గల్లిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ ను ఉపయోగించిన అందులో నుంచి 200 యూనిట్లను తీసివేసి బిల్లులు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, స్థానిక కౌన్సిలర్ గాలి రవి, అసెంబ్లీ కన్వీనర్ తాడే వార్ సాయినాథ్ , పట్టణ అధ్యక్షులు మల్లేష్ , అల్లెం దిలీప్, గౌతం పింగ్లే, కోర్వ శ్రీకాంత్, పట్టణ భాజాపా నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.