బోథ్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 28 :
నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సోనాల పట్టణంలోని ఉషోదయ పబ్లిక్ స్కూల్ బుధవారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి బోథ్ అసెంబ్లీ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ లు పాల్గొన్నారు. అనంతరం పిల్లలు చేసినటువంటి సైన్సు కృత్యాలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, సైన్స్ వల్లనే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు సైన్సు వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారని, కొత్త వాటిని సృష్టించే శక్తి సైన్స్ కు మాత్రమే ఉందని, ఎన్నో సేవలు అందించిన భారతీయ శాస్త్రవేత్తలకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు.