- భారతీయ జనతా పార్టీ పవార్ రామారావు పటేల్
నిర్మల్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 28 :
విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ భాగ్య లక్ష్మి దేవాలయం మరియు లాల్ దర్వాజ మహాకాళి దేవాలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించి చార్మినార్, శాలిబండ, రక్షా పురం, గౌలి పుర, సంతోష్ నగర్, కుర్మకుడ, సైదా బాద్, ముసారాబాద్, మలక్ పేట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మీదుగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని. దేశ రక్షణ ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బిజెపి రాష్ట్ర రథసారథి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి విజయకేతనం ఎగుర వేసేందుకు ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.