- మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శోభారాణి
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 27
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఆయన తల్లిపై పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వాపసు తీసుకొని ఎంపీ బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాలలో శోభారాణి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎనలేని కృషిచేసిన, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్లమెంటులో పెప్పర్ స్ప్రే అనుభవించిన పొన్నం ప్రభాకర్ ను విమర్శించే నైతిక హక్కు బండి సంజయ్ కుమార్ కు లేదన్నారు. ఇటువంటివి పునరా వృతమైతే సహించేది లేదని శోభారాణి హెచ్చరించారు.