Rr News Telangana
జగిత్యాల

మహిళల భద్రత మరియు రక్షణ కోసమే షీ టీమ్స్

  • మహిళలు,విద్యార్థినులకు ఆపద సమయంలో జిల్లా షీ టీమ్ నెంబర్ 8712670783 ద్వారా పిర్యాదు చేయండి
  • జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 27 

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం జ్యోతిబా ఫూలే స్కూల్ మరియు కాలేజ్, లక్ష్మిపుర్ లో షీ టీం, AHTU టీమ్,ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ తరఫున షీ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు షీ టీం ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు. షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని లేదా 8712670783 వాట్సప్ ద్వారా కూడా పిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా పరిధిలో పాఠశాలలు/కళాశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు ఇద్దరి చొప్పున విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్,ఆకతాయిల వేధింపులను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు బాలికలు విద్యార్థిని విద్యార్థులు వెంటనే జిల్లా షీ టీం ఫోన్ నెంబర్ 8712670783 కి కాల్ చేసిన కాని, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి వెంటనే షీ టీమ్స్ సహాయం పొదలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ASI లు వలీ బెగ్, శంకరయ్య , ఉమెన్ కానిస్టేబుల్ లు సౌజన్య , పూజిత, మంజుల, ఉపాధ్యాయులు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

సహకార శాఖలో సముద్రపు తిమింగలం

గాయత్రి ఆస్పత్రి వైద్యుడు నీలి సాగర్ పై దాడి చేసిన నలుగురి పై కేసు నమోదు

Rr News Telangana

బిఆర్ఎస్ లో గుర్తింపు లేదు.. అందుకే రాజీనామా

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group