- బ్లాక్మెయిల్ తో పాటు ప్రత్యక్ష, పరోక్ష దాడులకు దిగుతున్న భూకబ్జాదారులు
- జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు
- విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
కరీంనగర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 27 :
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల అన్యాకాంత్రం మరియు కబ్జాలు చేస్తున్నారని షేక్ సాబీర్ ఆలీ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు 1.(సర్వే నెం: 882,887 (అయ్యప్ప టెంపుల్ పరిధి) 2.(సర్వే నెం: 631, 629, 15వ వార్డు బిసి హస్టల్, ఆవాస విద్యాలయం, పాలిటెన్నిక్ కాలేజి పరిధి) 3.(సర్వే నెం: 467 16వ వార్డు, ముస్లీం ఈద్గా, ఖబ్రస్థాన్ పరిధి)4.(సర్వే నెం: 422, 431 3వ వార్డు మరియు 4వ వార్డు, కొత్తపల్లి, రామన్నపల్లి పరిధి) 5.(సర్వే నెం: 92, 93, 368 1వ వార్డు మరియు 2వ వార్డు, ధర్మారం పరిధి) లో అన్యాకాంత్రం మరియు కబ్జాలకు సంబందించిన విషయమై ఆధారాలతో సహ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని,ఇందులో జమ్మికుంట వ్యాప్తంగా ప్రజా సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వాలు (ప్రభుత్వ అనుబంధ శాఖలకు, కమ్యూనిటీ భవనములకు, ఉపాధి కల్పన వనరులకు, జర్నలిస్టులకు, మరియు అర్హులైన నిరుపేద లబ్దిదారులకు) కేటాయించడం జరిగిందని అన్నారు.సంబంధిత సర్వే నెంబర్లలో మిగిలున్న అత్యంత విలువైన ప్రభుత్వ భూముల నుండి వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందేందుకు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారికి ఉన్న రాజకీయ ప్రోద్బలంతో సదరు భూములను వెంచర్లు, అక్రమ నిర్మాణాల కోసమై ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తు స్థానిక రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖ అధికారుల ప్రమేయంతో నిబందనలకు విరుద్ధంగా సర్వే.నంబర్ తారు మారు చేస్తూ తప్పుడు దృవపత్రములు మరియు అనుమతులు మంజూరు చేయిస్తు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా సరియైన లబ్ధిదారులకు కేటాయించబడిన నివేశన స్థలాలను సహితం ఆక్రమించుకొని ప్రశ్నించిన వారిపై తప్పుడు ఫిర్యాదులతో పాటు ప్రతక్ష, పరోక్ష దాడులకు దిగుతు, ధౌర్జన్యమే ధ్యేయంగా రెచ్చిపోతున్న భూ కబ్జాదారులను నిలువరించే విధంగా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకమైన విచారణ కమిటిని ఏర్పాటు చేస్తు భాద్యులపైన శాఖపరమైన మరియు చట్టపరమైన చర్యలు చేపడుతూ సదరు భూములను స్వాధీనపర్చుకొని ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని పూర్తి ఆధారములతో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
ఈ విషయంపై కలెక్టర్ హుజురాబాద్ ఆర్.డి.ఒ ను విచారణకు ఆదేశిస్తూ నివేదికను అనుసరించి బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి, పాత సత్యం, మేడిపల్లి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.