మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 25 :
మెట్ పల్లి పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పట్టణ అధ్యక్షులు
బోయినిపెళ్లి చంద్రశేఖర రావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొన్న జరిగిన సాధారణ ఎలక్షన్ లో కో ఆప్షన్ పన్నాల మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా ఉండి పార్టీ అంతర్గత విషయాలను కాంగ్రెస్ పార్టీకి అందజేశాడని, దీనిపై పలుమార్లు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని,జిల్లా అధ్యక్షుడు మందలించినప్పటికి కూడా తీరు మార్చుకోలేదని శనివారం మున్సిపల్ చైర్మన్ భర్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, దానిపై టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నా మన్నారు. ఆరోపణ రుజువు చేయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వెంటనే జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు పన్నాల మాధవరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా కోఆప్షన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర రావు,కౌన్సిలర్స్ మొరపు గంగాధర్, లంక గంగాధర్, అంగడి పురుషోత్తం, పూజా గిరి శ్రీనివాస్, ద్యావన పెళ్లి రాజారాం, కొమిరెడ్డి శ్రీనివాస్, ఎనుగందుల శ్రీనివాస్ గౌడు, మార్గం హనుమాన్లు ,జియా, ఉజ్జల శ్రీనివాస్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.