కోరుట్ల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 22 :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తకలపెళ్లి సమీపంలో అతివేగంతో వస్తున్న ఇసుక ట్రాక్టర్ వెనుక భాగం తగిలి మెట్ పల్లి పట్టణానికి చెందిన కొమురవేల్లి రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మెట్ పల్లి పట్టణానికి చెందిన కొమురవేల్లి రాకేష్ మనోహర్ జ్యూవెల్లర్ లో పనిచేస్తున్నాడు. కోరుట్లలో ఓ వివాహానికి హాజరై తిరిగి మెట్ పల్లి వస్తుండగా కోరుట్ల మండలంలోని తకలపెల్లిలో అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ వెనుక భాగం రాకేష్ ను ఢీకొట్టడంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.