జగిత్యాల,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 21:
జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో బుధవారం రూరల్ మండలం ఆర్.ఎం.పి, పి.ఎం.పి ల నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ లో భాగంగా నాలుగోసారి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బుదరపు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా కోలా మహేందర్, క్యాషియర్ మేనిని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రూరల్ ఆర్.ఎం.పి, పి.ఎం.పి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల రూరల్ మండల వైద్యులు అందరికి అందుబాటులో ఉంటు ఏ అవసరం ఉన్న మా కమిటీ సభ్యులకు సహకరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభ్యులు కురుమ గంగాధర్, బోగ నాగభూషణం, శంకరయ్య, భూమరాజం, గంగాధర్, రాజారం, గోపి, గణేష్, మోహన్, నామ్, శంకర్, రవి, తిరుపతి, కమలాకర్, అబ్దుల్లా, రాజేష్, రాజు, లక్ష్మీనారాయణ, శంకర్, సంతోష్, ప్రశాంత్, మధు, తిరుమల చారి, కిష్టయ్య చారి, శశి, హుస్సేన్, సత్యం, మల్లేశం, రవి, సత్యనారాయణ, మహేష్, రామచంద్రం, వెంకటేష్, రూరల్ మండలంలోని ఆర్ఎంపి, పిఎంపీలు పాల్గొన్నారు.