- పార్టీ క్రమశిక్షణకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి
- బిజెపి సీనియర్ లీడర్ డాక్టర్ చిట్నేని రఘు
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
రాజకీయ లబ్ది కొరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ప్రతిపక్ష నేతల కుట్రలతో కొందరు చేస్తున్న ప్రచారాలు మానుకోవాలని డాక్టర్ రఘు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ఆదేశాలు, క్రమశిక్షణకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ రాహిత్యానికి ఎటువంటి చోటు కల్పించకూడదని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని,మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా తయారైందని, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ అరవింద్ నేతృత్వంలో బిజెపి నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిందన్నారు. ఎంపీ అరవింద్ పై ప్రతిపక్ష నేతల కుట్రల వల్ల అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, ఈ అసత్య ప్రచారాలను పార్టీ కార్యకర్తలు, నాయకులు దీటుగా ఎదుర్కొంటున్నారని, ఎంపీ అరవింద్ ను గానీ, బిజెపి పార్టీని గానీ బలహీనపరచడానికి అసత్యపు ప్రచారాలకు పాల్పడితే మరింత బలపడడం ఖాయమని,పార్టీ అధిష్టానం ఏది నిర్ణయించిన… పార్టీ నిర్ణయాలకు ప్రతీ కార్యకర్త కట్టుబడి ఉంటాడని,ఎంపీ అరవింద్ రాజకీయ చతురత వల్లనే గతంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండాను ఎగురవేసిన విషయం తెలిసిందేనని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సైతం మరో మారు బిజెపి సత్తాను చాటి కాషాయ రెపరెపలాడుతుందని, ఇప్పటికైనా ఎంపీ అరవింద్ పై దుష్ప్రచారాలు మానుకోవాలి డాక్టర్ రఘు హెచ్చరించారు.