భైంసా, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
భారతీయ సంస్కృతిలో గోవులకు విశేష ప్రాధాన్యత ఉందని, గోమాతను పూజించుకోవడం మన సంప్రదాయమని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. గోరక్షణ సంస్థ, మహిషా ఆధ్వర్యంలో పట్టణంలో నూతనంగా నిర్మించిన గోశాల షెడ్డు, కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా గోశాల స్థల దాత ఆస్తద్ ఏ చినాయ్, 390 ఎకరాల తమకున్న సొంత భూమిని గోశాల నిర్వాణ కోసం భూదాత మరియు ప్రవీణ్ మై శేఖర్ 13 గుంటలు తన సొంత భూమి గోశాల కొరకు తన సొంత భూమిని ఇవ్వడం జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ సాదుల కృష్ణదాస్, మాజీ చైర్మన్ బి గంగాధర్ తదితరులతో కలిసి రిబ్బన్ కట్ చేసి షెడ్డు, కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే గోశాలలోని గోవులకు పూజలు చేసి, ఆహారం తినిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోరక్షణ సంస్థ, మహిషా ఆధ్వర్యంలో దాతల సహకారంతో గోశాలను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం చినాయ్ మాట్లాడుతూ..గోశాల కోసం స్థలం దానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఇక్కడి ప్రజలు తమను గుర్తుపెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు, బీజేపీ నాయకులు సర్దార్ అభినవ్ కేతావత్, రమేష్ మాంధాన్ని నిమ్మల ప్రవీణ్ . దామోదర్ దామోదర్ జి .పట్టణ సీఐ రాజారెడ్డి, నాగనాథ్ పటేల్, గోరక్షణ సంస్థ మహిషా సభ్యులు, గోశాల సంరక్షణ కొరకు ఇచ్చిన దాతకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.