Rr News Telangana
తెలంగాణవరంగల్

మేడారం జాతరకు 6 వేల బస్సులు సిద్ధం

వరంగల్, ఆర్ ఆర్ తెలంగాణ :

మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో సజ్జనార్ మాట్లాడుతూ, జాతరకు 6వేల బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. 15వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉంటారని చెప్పారు. తెలంగాణలోని 51 పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నట్లు వివరించారు. జాతర బస్సుల్లో కోళ్లు, మేకలకు అనుమతి లేదన్నారు. ఈ సారి జాతరకు రెండువేల బస్సులను అదనంగా నడుపుతున్నట్లు చెప్పారు. జాతర బస్సులకు నార్మల్ ఛార్జీలే తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు.

Related posts

నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పోలస గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులు

Rr News Telangana

అక్రిడేషన్ కార్డులు అడ్డుపెట్టుకుని వసూళ్ల పర్వం

Rr News Telangana

బాసరలో ధర్నా చేపట్టిన ఆలయ సిబ్బంది

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group