కరీంనగర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ని మాతా శిశు కేంద్రంలో మూడు రోజుల శిశువు అపహరణ కలకలం రేపుతుంది. బీహర్ రాష్ట్రం ముజాపర్ జిల్లాకు చెందిన మనోజ్ రామ్ నిర్మలా దంపతులు కరీంనగర్ జిల్లా బాహుపేటలో గ్రానైట్ లో జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. కాగ నిర్మల ప్రసూతి కోసం మూడు రోజుల క్రింద కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రికి రాగ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఈ రోజు ఉదయం తండ్రి మనోజ్ తన బంధువుల అబ్బాయిని ఆ శిశువు దగ్గర ఉంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆ శిశువు అపహరణకు గురైంది. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించగా అపహరణకు గురైన పాప ను పట్టుకునేందుకు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో మూడు రోజుల శిశువు అపహరణ కలకలం రేపుతుంది. బీహర్ రాష్ట్రం ముజాపర్ జిల్లాకు చెందిన మనోజ్ రామ్ నిర్మలా దంపతులు కరీంనగర్ జిల్లా బాహుపేటలో గ్రానైట్ లో జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. కాగ నిర్మల ప్రసూతి కోసం మూడు రోజుల క్రింద కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రికి రాగ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం తండ్రి మనోజ్ తన బంధువుల అబ్బాయిని ఆ శిశువు దగ్గర ఉంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆ శిశువు అపహరణకు గురైంది. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించగా అపహరణకు గురైన పాప ను పట్టుకునేందుకు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు.