Rr News Telangana
కరీంనగర్తెలంగాణ

ఎంపీ సంతోష్ తండ్రిపై కేసు నమోదు

కరీంనగర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

రాజ్య సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్ రావుపై కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది. కరీంనగర్ రాంనగర్ లో నివాసముండే మిడ్ మానేరు నిర్వాసితుల సంక్షేమ సంఘం నేత కూస రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.ఆర్డీవోను బెదిరించి భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు యూ ట్యూబ్ ఛానల్లో తనపై జోగినిపల్లి రవీందర్ రావు తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని కూస రవీందర్ ఫిర్యాదు చేశారు. తనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును కూడా బద్నాం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు రవీందర్. ఎంపీ సంతోశ్ తండ్రి జోగినపల్లి రవీందర్ రావు ప్రోత్సాహంతో గూడ బాలకృష్ణ, అవుల నాగరాజు, సంపత్, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్ తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపాడు. ఈ ఫిర్యాదు మేరకు వారిపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జోగినపల్లి రవీందర్ రావును ఏ1గా చేర్చారు పోలీసులు.

Related posts

మేడారం వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

Rr News Telangana

బాసరలో ధర్నా చేపట్టిన ఆలయ సిబ్బంది

Rr News Telangana

మేడారం మహా జాతరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group