Rr News Telangana
క్రైమ్గొల్లపల్లిజగిత్యాల

గంజాయి ముటా గుట్టు రట్టు చేసిన గొల్లపల్లి పోలీసులు

  • వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘు చందర్జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

గంజాయి తరలిస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు పెట్టుకున్నారని జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లలో గంజాయి నిర్మూలనకు జగిత్యాల డి ఎస్పీ రఘు చందర్ ఆద్వర్యంలో, ధర్మపురి సిఐ రామ్ నరసింహా రెడ్డి , గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ సిబ్బందితో ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న నిందితులను శనివారం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..

గత రెండు సంవత్సరాల నుండి నిందితులు మారంపెల్లి లక్ష్మన్ , దొమ్మటి కార్తీక్ గంజాయికి బానిస అయ్యారని ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో, గంజాయి ఎక్కడైన తక్కువ ధరకు కొని, ఇక్కడకు తీసుకవచ్చి తాగేవాడు, మిగిలిన గంజాయి ఎక్కువ ధరకు అమ్మితే పైసలు ఎక్కువ వస్తయని దానితో వారి ఖర్చులు తీర్చుకుంటు, జల్సాలు చేయవచ్చని నిందితులు నిర్ణయించుకున్నారు.
గంజాయి ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోగ వారి స్నేహితుడు పెగడపెల్లికి చెందిన అజయ్ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నూకరాజు అనే వ్యక్తి వద్ద గంజాయి తక్కువ ధరకు దొరుకుతుందని, అతని వద్ద గంజాయి తీసుకొని వస్తే మనం వాడుకుని మిగిలింది ఎక్కువ ధరకు అమ్ముకుందమని అజయ్ చెప్పి, నూకరాజు యొక్క అడ్రస్స్ ఇచ్చారని పోలీసులు తెలిపారు., నిందితులు పల్సర్ బైక్ పై ఒడిస్సాకు వెళ్లి నూకరాజును కలువగా, నూకరాజు గంజాయి 13.24 కిలోలు, చరాస్ 40 గ్రాముల వాటిని బ్యాగులో వేసుకొని, అక్కడే ఉండి బైక్ మీద భద్రాచలం, కరీంనగర్ మీదుగా అబ్బాపూర్ కి వస్తుండగా సాయంత్రం చిల్వకోడూర్ టీ జంక్షన్ వద్దకు రాగేనే పోలీసులు నిందితులను పట్టుకొని నిందుతుల వద్ద నుండి 13.24 కిలోల గంజాయి, 40 గ్రామ్స్ చరాస్, రెండు సెల్ ఫోన్లు , ఒక పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న గంజాయి , చెరాస్ రూ.2.65 లక్షల విలువ వుంటుందని డిఎస్పీ రఘు చందర్
తెలిపారు.

పట్టుపడిన నిందితులు వివరాలు :

1. మారంపెల్లి లక్ష్మన్ , గ్రామం బాలపల్లి, జగిత్యాల రూరల్ మండలం కాగా
2. దొమ్మటి కార్తీక్ అబ్బాపూర్ గ్రామం మండలం గొల్లపల్లి
3. అజయ్ పెగడపల్లి
4. నూకరాజు, ఒడిస్సాకు చెందిన ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి , గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్, సిబ్బంది జె.వేణు,హలీం,లక్ష్మన్, రమేష్, వేణు , సిడిఆర్ వింగ్ సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ అభినందిoచారు.

Related posts

138వ మేడేను జయప్రదం చేయండి

Rr News Telangana

మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాలలో ట్రాఫిక్ ఆంక్షలు

Rr News Telangana

మాజీ భర్తపై యాసిడ్ పోసిన భార్య

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group