మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన అబ్బూరి చిన్న మల్లయ్య మృతి చెందడంతో, అతడి బంధువులు అబ్బూరి మహేష్ గౌడ్, అశోక్ గౌడ్, రాకేష్ గౌడ్, అల్వల,శ్రీనివాస్, లు మెట్ పల్లి కి వచ్చి అబ్బూరి.చిన్న మల్లయ్య మృతికి నువ్వే కారణమంటూ గురువారం గాయత్రి ఆసుపత్రి వైద్యుడు నీలి సాగర్ పై దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించి, ఆసుపత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో గాయత్రి ఆస్పత్రి వైద్యుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యుడు నీలి సాగర్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.
previous post