- విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల వితరణ
మోర్తాడ్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహా దారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించు కొని కాంగ్రెస్ నాయకుడు నరాల రత్నాకర్ సౌజన్యంతో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష పాడ్ లు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నరాల నిహర్,
వరద బట్టు వేణు రాజ్ మాట్లాడుతూ గతంలో NSUI నాయకుడు నుంచి మొదలుపెట్టుకొని,
ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా ప్రతిపక్ష నేతగా ప్రజలకు అనేక విధాలుగా సేవలందించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేకఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మా నాయకుడు షబ్బీర్ అలీ అని, ప్రజా ప్రతినిధిగా అనేక అభివృద్ధి పనులు చేపించి ప్రజా సమస్య సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమించిన వ్యక్తి షబ్బీర్ అలీ సార్గారని, కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసానిస్తూ పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా కార్యకర్తలను పార్టీని కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తని ఆయన అన్నారు. గత 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమైన షబ్బీర్ అలీ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారునిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయనకు ఉన్న అనుభవం ఆయా వర్గాల సమస్యల పట్ల ఆయనకున్న అవగాహనతో ఆయన ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు, సూచనలు తద్వారా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ఉపయోగపడతా యని అన్నారు. ఈ కార్యక్రమంలో NSUI జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ రెడ్డి, సందీప్ రెడ్డీ, సాయి, సందీప్, రనిల్, సచిన్, సత్విక్, తదితరులు పాల్గొన్నారు.