ఆదిలాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజికవర్గం నుండి శ్రీరాముడి దర్శనానికి అయోధ్య పట్టణానికి వెళ్తున్న రామ భక్తులకు , హిందూ ధర్మ రక్షకులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో కలిసి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా అయోధ్యకు వెళుతున్న రామభక్తులు, బిజెపి కార్యకర్తలు జాదవ్ రాజేష్ బాబు గారి తరుపున సుమారు 1100 మంది యాత్రికులకు భోజనాలు ఏర్పాటు చేసినందుకు గాను ప్రత్యేకంగా జాదవ్ విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొమరంభీమ్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ విజయ్ జాదవ్ గారు మరియు సిర్పూర్ మరియు ఆసిఫాబాద్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.