Rr News Telangana
జగిత్యాలతెలంగాణ

సమాచార శాఖ హెడ్ ఆఫీస్ కు DPRO దశరథం బదిలీ

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
సమాచార, పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు DPRO మామిండ్ల దశరథం బదిలీ అయ్యారు.ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల బదిలీల నేపథ్యంలో DPRO మామిండ్ల దశరథం బదిలీ చేశారు.ప్రస్తుతం సమాచార హెడ్ ఆఫీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో మామిండ్ల దశరథం కొనసాగుతూ.. జిల్లా ఇంచార్జీ బాధ్యతలు చూస్తున్నారు. ఇదే జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ వీరి స్వగ్రామం. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఐదున్నర సంవత్సరాలుగా మామిండ్ల దశరథం సేవలు అందించారు. సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిగా పని చేశారు. ఫ్రెండ్లీ ఆఫీసర్ గా పేరుపొందారు. గతంలో కీలకంగా ఉన్న సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమర్థవంతంగా పని చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించారు.మీడియాను ఎప్పటి కప్పుడు సమన్వయం చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో విశేష కృషి చేశారు. కరీంనగర్ DPRO కార్యాలయంలో అదనపు పౌర సంబంధాల అధికారి గా పని చేసిన శారద ను ఇక్కడికి బదిలీ చేసి ఇంచార్జీ DPRO గా నియమించారు.

Related posts

మేడారం వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

Rr News Telangana

ఈ నెల 21న కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Rr News Telangana

బాసరలో ధర్నా చేపట్టిన ఆలయ సిబ్బంది

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group