- 76 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1
ఫోర్ వీల్లర్ లను సీజ్ చేసిన పోలీసులు
బైంసా, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో సిద్దార్థ్ నగర్, పురాణ బజార్ లో జిల్లా ఎస్పీ, బైంసా ఏఎస్పీ క్రాంతిలాల్ సుభాష్ పాటిల్ ఆదేశాలు మేరకు మంగళవారం వేకువ జామున బైంసాలో అదనపు పోలీసు బలగాలతో కార్టూన్ సర్చ్ పట్టణ సిఐ రాజారెడ్డి నేతృత్వంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహన చోదకులు వాహనానికి సంబంధించిన కాగిత పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.
కార్టూన్ సర్చ్ లో కొన్ని విషయాలు దృష్టికి వచ్చాయని, వాటిని సంబంధించిన అధికారులు దృష్టికి తీస్కవెళ్లి , పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అపరిమిత వ్యక్తులు సంచరిస్తే , నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రత పరిరక్షణ పోలీసులను పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు అదనపు బలగాలు పాల్గొన్నారు.