హైదరాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల ఏజ్ లిమిట్‌ను 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ వయోపరిమితి పెంపును యూనిఫామ్ సర్వీసెస్‌కు మినహాయించింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ సడలింపు వర్తించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టీపీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, గత ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో పలు పోటీ పరీక్షలకు తమ ఏజ్ లిమిట్ అయిపోయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వయోపరిమితి పెంచాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిరుద్యోగుల విజ్ఞప్తిని పరిణగలోనికి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంచుతూ శుభవార్త చెప్పింది.
previous post
next post