రాజన్న సిరిసిల్ల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన పల్లె రమణ అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన కొడుకుకు ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉండేదని , జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుమందు తాగిందని, కుటుంబ సభ్యులు గమనించి ఎల్లారెడ్డిపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ మరణించిందని వెల్లడించారు. మృతురాలి కుమారుడు పల్లె అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఏఎస్ఐ వెంకటరమణ పత్రికా ప్రకటనలో తెలిపారు.