Rr News Telangana
తెలంగాణహైదరాబాద్

అసెంబ్లీకి రాని కెసిఆర్ న‌ల్గొండ‌కు ఎలా వెళ్తారు

  • డిప్యూటీ సిఎం భ‌ట్టి

హైదరాబాద్, ఆర్ ఆర్ న్యూజ్ తెలంగాణ :
అసెంబ్లీకి రాని వ్యక్తి మంగళవారం నల్గొండలో వెళ్తావా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపాలని కోరితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు . అసెంబ్లీకి రాని వ్యక్తి రేపు బహిరంగ సభకు వెళ్తారా అంటూ నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ఈఎన్‌సీ మురళీధరరావు బిఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. పదవీ విరమణ చేసినా పదేళ్లపాటు బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కొనసా గించారని విమర్శించారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చాలా మంది బీఆర్ఎస్ ఏజెంట్లు ఉన్నారని… వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈఎన్సీ మురళీధరరావు చేత బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆయన ఆరోపించారు. రిటైర్ అయినప్పటికీ ఆయనను పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్లో రేయింబవళ్లు పనులు జరుగుతుంటే గత ప్రభుత్వం ప్రశ్నించలేదని అడిగారు. శ్రీశైలంలో ఫ్లడ్లైట్లు పెట్టి మరీ పనులు చేసిందని తెలిపారు. గోదావరి జలాలు, శ్రీశైలంలో మన భూభాగాలున్నా యని వాటి కోసం ఒప్పందాలు చేసుకున్నాం అనడం అర్థరహితం అన్నారు. తెలంగాణ నీళ్ల కోసమే పుట్టిందని, వాటి కోసమే పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కనీసం ఇప్పుడైనా ఆ నీటిని సమర్ధవంతంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంటే గతంలో జరిగినవి మళ్లీ గుర్తు చేసుకుని రాష్ట్రానికి అన్యాయం చేయకూడదని కోరారు.

Related posts

వివాహిత ఆత్మహత్య

Rr News Telangana

హైదరాబాద్ లో మరో దారుణం

Rr News Telangana

మేడారం వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group