కోరుట్ల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ త్రిశక్తి మాత దేవాలయంలో ఆదివారం రాజశ్యామల నవరాత్రి ఉత్సవ సందర్భంగా ఆలయంలో సామూహిక రాజశ్యామల సమేత చండీ హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో 50 మంది జంటలు పాల్గొన్నారు. హోమం అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, సభ్యులు విజయ్, కార్తీక్, ఆలయ అర్చకులు పాలెపు శివ, రోహిత్ పాండే మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.