- పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశం ను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- రెండు విఐపి కార్లలో వచ్చి కిడ్నాప్ కు పాల్పడ్డ వైనం
- భార్యను మార్గ మద్యంలో కార్ లో నుండి నెట్టి వేశారు
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచుపల్లి గ్రామానికి చెందిన పోగుల రాజేశంను ఆదివారం ఉదయం 9 గంటలకు కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
ఛత్తీస్ ఘడ్ పోలీసులుగా అనుమానం :
రేచపల్లిలోని తన స్వగృహం నుండి రెండు వి.ఐ.పి. కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పోగుల రాజేశంను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ కు పాల్పడ్డారు.వెంట వెళ్లిన భార్యను మార్గ మధ్యలో కారు నుండి బలవంతంగా దింపేసి వెళ్లి పోయారు. కార్లకు అడ్డు తిరిగిన కొడుకును బలవంతంగా ప్రక్కకు నెట్టేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. జగిత్యాల డిఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చేయనున్న పోగుల రాజేశం కుటుంబసభ్యులు.