కొడంగల్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
కొడంగల్ నియోజకవర్గం ఉమ్మడి మద్దూర్ మండల అభివృద్ధి కోసం 183 కోట్ల రూపాయలను మంజూరు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని వారి పేర్కొన్నారు. కొడంగల్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అధికారి నియమించారు. కొడంగల్ నారాయణపేట 69 జీవోను అమలు చేస్తూ, పరిపాలన అనుమతులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నర్సిములు, జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమావేశంలో పాల్గొన్నారు…