Rr News Telangana
జగిత్యాలతెలంగాణ

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ మండల పరిధిలోని లక్ష్మిపుర్ గ్రామంలో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ ఐ మాట్లాడుతూ… నేను సైతం అనే కార్యక్రమం ద్వారా  పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని  గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోందని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.

తల్లిదండ్రులు  పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో  చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు తత్రాలు ముడ నమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా

Rr News Telangana

సర్వే నెంబర్ 1006 లో అక్రమ ఫ్లాట్లు

Rr News Telangana

ధరణి పాస్ బుక్ పనిచేయదు అంటున్న సర్వేయర్ గుగులోతు తులియా నాయక్

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group