మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో గణేష్ మృతదేహం లభ్యం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలానికి చెందిన రొయ్యల గణేష్ ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో నీళ్లకోసం గణేష్ తమ్ముడు కెనాల్ లో దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోగా, తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో గణేష్ నీటిలో కొట్టుకుపోయాడు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం గ్రామ శివారులో గణేష్ మృతదేహం లభ్యమైంది. గణేష్ తల్లి రొయ్యల గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.