- ఇద్దరికి గాయాలు ఆస్పత్రికి తరలింపు
జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య వాహనం డ్రైవర్, పారిశుద్ధ్య సహాయకునిగా పనిచేస్తున్న డ్రైవర్ నాగరాజు లేబర్ కళ్యాణ్ లకు TS02 FF 1951 అనే నెంబర్ గల వాహనం వేగంతో అదుపు తప్పి చెత్తను సేకరించే వాహనానికి ఢీ కొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్లు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పలకరించి వారి ఆరోగ్యం కోలుకునేలాగా మెరుగైన వైద్యాన్ని సమకూర్చుతామని ధైర్యం చెప్పి ,ఢీ కొట్టిన ప్రైవేటు వాహనానిపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.