బాసర, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
గత నాలుగు నెలల నుండి తమకు జీతాలు రావట్లేదని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే గల ఏకైక సరస్వతి అమ్మవారు కొలువైన బాసర ఆలయంలో విధులు నిర్వర్తించే సుమారు 83 మంది ఎన్ ఎం ఆర్ సిబ్బంది ధర్నాకు దిగారు…వాగ్దేవి లేబర్ సొసైటీని రద్దు చేసి దేవస్థానం ఉద్యోగులుగా గుర్తించాలని 83 మందికి ఉద్యోగ భద్రత కల్పించి జీవో నెంబర్ 60 ప్రకారం తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.చాలీ చాలని వేతనం తో 2002 నుండి పని చేస్తున్నామని ప్రస్తుతం తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. బాసర ఆలయంలో హోంగార్డులుగా పనిచేస్తున్న వారిని తొలగించి వాగ్దేవి సిబ్బందిలో అర్హులైన వారికి జాయిన్ చేసుకోవాలని చెప్పి నాలుగు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా బాసర ఆలయంలో గల ఈవో కార్యాలయం ముందు శాంతియుత నిరసనకు దిగారు. దేవాదాయ శాఖ కమిషనర్ తో మాట్లాడి ఎన్ఎంఆర్ ఉద్యోగుల సమస్యలను తీరుస్తామని ఆలయ ఈవో తెలిపారు.
previous post